భారత్ లో మరో 29,398 కరోనా కేసులు…414 మరణాలు

Friday, December 11th, 2020, 11:07:39 AM IST

కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత భారత్ లో కొనసాగుతూనే ఉంది. అయితే ఈ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉన్నా, కేసుల విషయం లో మాత్రం కట్టడి గానే ఉంది. అయితే గడిచిన 24 గంటల్లో మరో 8,72,497 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 29,398 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 97,96,769 కి చేరింది.

అదే తరహా లో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 414 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,42,186 కి చేరింది. అయితే కరోనా వైరస్ రికవరీ రేటు భారత్ లో మెరుగ్గా ఉందని చెప్పాలి. కరోనా వైరస్ రికవరీ రేటు భారత్ లో 94.84 శాతంగా ఉంది. ఇప్పటి వరకూ 92,90,834 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ప్రస్తుతం భారత్ లో 3,63,749 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.