దేశ రాజధాని లో భారీగా నమోదు అవుతున్న కరోనా కేసులు

Saturday, September 19th, 2020, 02:11:52 AM IST

Corona
భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుంది. అయితే దేశ రాజధాని లో సైతం ఈ మహమ్మారి తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఢిల్లీ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో మరో 4,127 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకూ 2,38,828 మందికి కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తోంది. అయితే ఢిల్లీ లో భారీగా కేసులు నమోదు కావడం పట్ల దేశ ప్రజలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాక గడిచిన 24 గంటల్లో 30 మంది ప్రాణాలను కోల్పోగా, ఇప్పటి వరకు ఢిల్లీ లో కరోనా వైరస్ సోకి మృతి చెందిన వారి సంఖ్య 4,907 కి చేరింది. గడిచిన 24 గంటల్లో 3,568 మంది కొలుకోగా, ఇప్పటి వరకూ కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య ఢిల్లీ లో 2,01,671 కి చేరింది. ఢిల్లీ లో ప్రస్తుతం 32,250 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.