భారత్ లో తగ్గని కరోనా ఉధృతి…మరో 4,120 మంది మృతి!

Thursday, May 13th, 2021, 10:20:20 AM IST

india_corona
భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 18 లక్షల 64 వేల మందికి పైగా కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 3,62,727 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2 కోట్ల 37 లక్షలకు పైగా చేరింది. అయితే ఈ మహమ్మారి తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉండటం పట్ల ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు. క్రితం రోజు కంటే మళ్ళీ పాజిటివ్ కేసులు పెరగడం కాస్త ఆందోళన కలిగిస్తోంది.

అదే తరహా లో కరోనా వైరస్ మృతుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో మరో 4,120 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ మరణాల తో మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 2,58,317 కి చేరింది. నిన్న ఒక్క రోజే 3,52,181 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ఇప్పటి వరకూ భారత్ లో కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య కోటి 97 లక్షలకు చేరింది. అయితే ప్రస్తుతం భారత్ లో 37,10,525 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.