తెలంగాణ లో మరో 412 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు

Tuesday, March 23rd, 2021, 10:18:46 AM IST

తెలంగాణ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. మళ్ళీ ఊహించని రీతిలో 400 కి పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో మరో 68,171 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 412 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం తెలంగాణ రాష్ట్రం లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 3,03,867 కి చేరింది. అయితే పెరుగుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసుల పట్ల ప్రజలు అప్రమత్తం గా ఉండాలని నిపుణులు అంటున్నారు

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో ముగ్గురు కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ మరణాల తో మొత్తం తెలంగాణ రాష్ట్రం లో ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,674 కి చేరింది. నిన్న ఒక్క రోజే 216 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ఇప్పటి వరకూ 2,99,042 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లో 3,151 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.