భారత్ లో స్వల్పం గా తగ్గిన కరోనా ఉధృతి…మరో 412 మంది మృతి!

Thursday, December 10th, 2020, 11:18:57 AM IST

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే గత కొద్ది రోజులుగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తక్కువగా నమోదు అవుతున్నాయి. మరణాలు కూడా 500 కంటే తక్కువగానే ఉంటున్నాయి. అయితే తాజాగా 9,22,959 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 31,521 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 97,67,371 కి చేరింది. ఈ పాజిటివ్ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

అయితే అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 412 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,41,772 కి చేరింది. అయితే నిన్న ఒక్కరోజే 37,725 మంది కరోనా వైరస్ భారీ నుండి కొలుకొగా, ఇప్పటి వరకు 92,53,306 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ప్రస్తుతం భారత్ లో 3,72,293 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.