భారత్ లో కొనసాగుతున్న కరోనా ఉధృతి…మరో 4,106 మంది మృతి!

Monday, May 17th, 2021, 11:41:52 AM IST

india_corona

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 15,73,515 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 2,81,386 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అయితే తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2 కోట్ల 49 లక్షలకు చేరింది. అయితే ఈ మహమ్మారి తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉండటం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే మూడు లక్షలకు దిగువగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కావడం కాస్త ఊరట కలిగించే అంశం అని చెప్పాలి.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో మరో 4,106 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ మరణాల తో మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 2,74,390 కి చేరింది. నిన్న ఒక్క రోజే 3,78,741 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. పాజిటివ్ కేసుల కంటే రికవరీ ల సంఖ్య ఎక్కువగా ఉండటం ఊరట కలిగించే అంశం అని చెప్పాలి. మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య 2,11,74,076 కి చేరింది. ప్రస్తుతం భారత్ లో 35,16,997 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.