ఏపీ లో మారని కరోనా పరిస్థితి…మరో 41 మంది మృతి

Thursday, October 1st, 2020, 10:41:43 PM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 71,577 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 6,751 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 6,97,340 కి చేరింది. ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

అదే తరహాలో కరోనా వైరస్ మహమ్మారి భారిన పడి ప్రాణాలను కోల్పోతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో మరో 41 మంది కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలను కోల్పోయారు. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో, మొత్తం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ సోకి మృతి చెందిన వారి సంఖ్య 5,869 కి చేరింది. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ రికవరీ రేటు కాస్త మెరుగ్గా ఉందని చెప్పాలి. గడిచిన 24 గంటల్లో 7,297 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకొగా, ఇప్పటి వరకూ కరోనా వైరస్ నుండి కోలుకున్న వారి సంఖ్య 6,33,613 కి చేరింది. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో 57,858 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.