భారత్ లో తగ్గని కరోనా ఉధృతి…మరో నాలుగు వేలకి పైగా మరణాలు

Sunday, May 9th, 2021, 11:00:10 AM IST

india_corona

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో చేసిన కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలలో 4,03,738 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2,22,96,414 కి చేరింది. అయితే ఈ మహమ్మారి తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉండటం వలన ప్రజలు మరింత భయాందోళన చెందుతున్నారు. అయితే పెరుగుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసుల పట్ల ప్రజలు మరింత అప్రమత్తం గా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో మరో 4,092 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ మరణాల తో మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 2,42,362 కి చేరింది. నిన్న ఒక్క రోజే 3,86,444 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ఇప్పటి వరకూ కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య 1,83,17,404 కి చేరింది. ప్రస్తుతం భారత్ లో 37,36,648 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.