భారత్ లో మరో 3,11,170 కేసులు…4,077 మరణాలు

Sunday, May 16th, 2021, 10:52:51 AM IST

india_corona
భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 18,32,950 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 3,11,170 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అయితే ఇప్పటి వరకు భారత్ లో 31,48,50,143 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 2,46,84,077 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అయితే ఇప్పటి వరకు ఇన్ని కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కావడం పట్ల ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా నమోదు అవుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసుల పట్ల ప్రజలు మరింత అప్రమత్తం గా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో మరో 4,077 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ మరణాల తో మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 2,70,284 కి చేరింది. నిన్న ఒక్క రోజే 3,62,436 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ఇప్పటి వరకూ కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య భారత్ లో 2,07,95,335 కి చేరింది. ప్రస్తుతం భారత్ లో 36,18,458 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.