భారత్ లో మరో 3,43,144 కేసులు…4,000 మరణాలు!

Friday, May 14th, 2021, 10:35:35 AM IST

india_corona
భారత్ లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతూనే ఉంది. లక్షల్లో పాజిటివ్ కేసులు, వేల సంఖ్యలో మరణాలు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో మరో 18,75,515 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 3,43,144 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య రెండు కోట్ల నలబై లక్షలకు పైగా చేరింది. అయితే ఈ మహమ్మారి తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉండటం పట్ల ప్రజలు మరింత భయాందోళన చెందుతున్నారు. అయితే మరింత అప్రమత్తం గా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో మరో 4,000 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ మరణాల తో మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 2,62,317 కి చేరింది. నిన్న ఒక్క రోజే 3,44,776 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. అయితే గడిచిన 24 గంటల్లో నమోదు అయిన పాజిటివ్ కేసుల కంటే రికవరీ లు ఎక్కువగా ఉండటం ఊరట కలిగించే అంశం అని చెప్పాలి. అయితే తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ రికవరీ లతో మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య రెండు కోట్ల కి పైగా చేరింది. ప్రస్తుతం భారత్ లో 37,04,893 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.