తెలంగాణలో మరో 397 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు

Tuesday, December 29th, 2020, 10:48:21 AM IST

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 42,737 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 397 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం తెలంగాణ రాష్ట్రం లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2,85,465 కి చేరింది. అయితే ఈ మహమ్మారి కి ఇంకా పూర్తి స్థాయిలో వాక్సిన్ అందుబాటులో లేకపోవడం తో పాజిటివ్ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో ఇద్దరు కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో కలిపి మొత్తం తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ సోకి ఇప్పటి వరకు ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,535 కి చేరింది. నిన్న ఒక్కరోజే 627 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. తాజాగా కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి తో కలిపి మొత్తం తెలంగాణ రాష్ట్రం లో ఇప్పటి వరకు కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య 2,77,931 కి చేరింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లో 5,999 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టీవ్ గా ఉన్నాయి.