తెలంగాణ లో 394 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు

Sunday, March 21st, 2021, 01:30:14 PM IST

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 64,898 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 394 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం తెలంగాణ రాష్ట్రం లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 3,03,118 కి చేరింది. అయితే తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉండటం పట్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

అదే తరహా లో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో ముగ్గురు కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ మరణాల తో మొత్తం తెలంగాణ రాష్ట్రం లో ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,669 కి చేరింది. నిన్న ఒక్క రోజే 194 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ఇప్పటి వరకూ తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య 2,98,645 కి చేరింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లో 2,804 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. దేశ వ్యాప్తంగా కరోనా వాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం గా కొనసాగుతుండటం తో పాజిటివ్ కేసుల సంఖ్య తో పాటుగా మృతుల సంఖ్య కూడా తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.