భారత్ లో మరో 26,382 కేసులు…387 మరణాలు

Wednesday, December 16th, 2020, 11:06:13 AM IST

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే గత కొద్ది రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. అంతేకాక మృతుల సంఖ్య సైతం రోజుకి 400 కి దిగువన నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో మరో 10,85,625 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 26,382 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 99,32,547 కి చేరింది.

అయితే అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 387 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,44,096 కి చేరింది. ఇప్పటి వరకూ 94,56,449 మంది కరోనా వైరస్ భారీ నుండి కొలుకొగా, ఇంకా 3,32,002 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.