తెలంగాణ లో తగ్గుముఖం పట్టిన కరోనా తీవ్రత

Monday, December 14th, 2020, 10:00:32 AM IST


తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా నమోదు అవుతున్న గణాంకాల తో రాష్ట్ర ప్రజలు కాస్త ఊరట లభించింది అని చెప్పాలి. గడిచిన 24 గంటల్లో మరో 28,980 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 384 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2,78,108 కి చేరింది. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల మేరకు ఈ కరోనా వైరస్ ను కాస్త అరికట్టినట్లు తెలుస్తోంది.

అయితే కరోనా వైరస్ చికిత్స పొందుతూ మరో ముగ్గురు తుది శ్వాస విడిచారు. అయితే కరోనా వైరస్ భారిన పడి ఇప్పటి వరకు ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,496 కి చేరింది. అంతేకాక కరోనా వైరస్ భారీ నుండి కోలుకుంటున్న వారి సంఖ్య మెరుగ్గానే కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో మరో 631 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకొగా, ఇప్పటి వరకూ కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య 2,69,232 కి చేరింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లో 7,380 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.