దేశ రాజధాని లో కరోనా ఉగ్ర రూపం..!

Friday, September 25th, 2020, 02:04:56 AM IST

Corona
భారత దేశం లో కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉంది. దేశ రాజధాని లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 3,834 మంది కరోనా వైరస్ భారిన పడ్డారు. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో ఢిల్లీ లో ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2,60,623 కి చేరింది. అయితే భారీ గా నమోదు అవుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో అక్కడి వారు తీవ్ర స్థాయిలో భయాందోళన చెందుతున్నారు.

అదే తరహాలో కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలను కోల్పోతున్నారు. గడిచిన 24 గంటల్లో 36 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకి మృతి చెందిన వారి తో కలిపి మొత్తం ఢిల్లీ లో మృతి చెందిన వారి సంఖ్య 5,123 కి చేరింది. అయితే కరోనా వైరస్ సోకి కోలుకున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 3,509 మంది కొలుకోగా, ఇప్పటి వరకూ కరోనా వైరస్ నుండి కోలుకున్న వారి సంఖ్య 2,24,375 కి చేరింది. ప్రస్తుతం 31,125 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.