తెలంగాణలో మరో 3,816 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు

Monday, May 17th, 2021, 07:24:14 AM IST

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 44,985 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 3,816 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం తెలంగాణ రాష్ట్రం లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 5,28,823 కి చేరింది. అయితే ఈ పాజిటివ్ కేసులు ఇంకా పెరుగుతూనే ఉండటం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 27 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ మరణాల తో మొత్తం తెలంగాణ రాష్ట్రం లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 2,955 కి చేరింది. నిన్న ఒక్క రోజే 5,892 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. అయితే నమోదు అయిన పాజిటివ్ కేసుల కంటే రికవరీ లు ఎక్కువగా ఉండటం కాస్త ఊరట కలిగించే అంశం అని చెప్పాలి. ఇప్పటి వరకూ తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య 4,74,899 కి చేరింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లో 50,969 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.