ఏపీ లో తగ్గిన కరోనా కేసులు…మరో 38 మంది మృతి

Monday, October 5th, 2020, 10:17:58 PM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతుంది. గడిచిన 24 గంటల్లో 56,145 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 4,256 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 7,20,617 కి చేరింది. అయితే ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

అదే తరహాలో కరోనా వైరస్ మరణాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో మరో 38 మంది కరోనా వైరస్ భారిన పడి చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో మొత్తం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి మృతి చెందిన వారి సంఖ్య 6,019 కి చేరింది. గడిచిన 24 గంటల్లో 7,558 మంది కరోనా వైరస్ భారీ నుండి కొలుకోగ, ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి కోలుకున్న వారి సంఖ్య 6,63,538 కి చేరింది. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో 51,060 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.