భారత్ లో మళ్ళీ పెరిగిన కేసులు… మరో 3,780 మంది మృతి!

Wednesday, May 5th, 2021, 11:04:28 AM IST

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే ప్రతి రోజూ మూడు లక్షలకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కావడం తీవ్ర భయాందోళన కలిగిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో మరో 15,41,299 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 3,82,315 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అయితే మొన్నటి తో పోల్చితే నిన్న కేసులు పెరిగాయి అని చెప్పాలి. అయితే తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2,06,65,148 కి చేరింది. అయితే ఈ మహమ్మారి తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉండటం పట్ల ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో మరో 3,780 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ మరణాల తో మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 2,26,188 కి చేరింది. అయితే నిన్న ఒక్క రోజే 3,38,439 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. అయితే ఈ మహమ్మారి భారీ నుండి కోలుకుంటున్న వారి సంఖ్య సైతం పెరుగుతూనే ఉండటం కాస్త ఊరట కలిగించే అంశం అని చెప్పాలి. ఇప్పటి వరకూ భారత్ లో 1,69,51,731 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ప్రస్తుతం భారత్ లో 34,87,229 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.