ఏపీ లో మరో 368 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు

Sunday, March 21st, 2021, 11:02:32 PM IST

AP_corona

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 31,138 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 368 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 8,90,839 కి చేరింది. అయితే కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉండటం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే గడిచిన 24 ఒక్కరు కూడా కరోనా వైరస్ మహమ్మారి కారణంగా మృతి చెందలేదు. అయితే నిన్న ఒక్క రోజే 263 మంది కరోనా వైరస్ మహమ్మారి భారీ నుండి కోలుకున్నారు. ఇప్పటి వరకూ 8,81,462 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో 2,188 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.