బిగ్ అలర్ట్: తెలంగాణలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులు..!

Saturday, March 20th, 2021, 11:34:31 AM IST

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిందని ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో రోజుకు 300కి పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే తాజాగా గడిచిన 24 గంటలలో రాష్ట్ర వ్యాప్తంగా 66,036 కరోనా పరీక్షలు నిర్వహించగా 364 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,02,724 కి చేరింది.

అయితే కరోనా నుంచి ఇప్పటివరకు 2,98,451 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇంకా 2,607 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 189 మంది కరోనా నుంచి కోలుకోగా ఇద్దరు మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,666 కి చేరింది. ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 95,48,685 టెస్ట్‌లు చేశారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 96.1 శాతం ఉండగా, మరణాల రేటు 0.55% ఉన్నట్టు హెల్త్ బులెటిన్ తెలిపింది.