భారత్ లో భారీగా తగ్గిన కరోనా కేసులు…మరో 354 మంది మృతి

Tuesday, December 15th, 2020, 11:05:59 AM IST

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే జూలై అనంతరం అత్యల్పం గా మరొకసారి కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. గడిచిన 24 గంటల్లో 9,93,665 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 22,065 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 99,06,165 కి చేరింది. అయితే దీని తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉంది.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 354 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,43,709 కి చేరింది. నిన్న ఒక్కరోజే 34,477 మంది కరోనా వైరస్ నుండి కోలుకొగా, కరోనా వైరస్ రికవరీ రేటు 95.12 శాతానికి చేరుకుంది. ఇంకా భారత్ లో 3,39,820 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.