బిగ్ న్యూస్: భారత్ లో తగ్గని కరోనా ఉధృతి…మరో 354 మంది మృతి!

Wednesday, March 31st, 2021, 10:53:16 AM IST

india_corona

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 10,22,915 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 53,480 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 1,21,49,335 కి చేరింది. అయితే పాజిటివ్ కేసులు 50 వేలకు పైగా నమోదు అవుతూ ఉండటం పట్ల ప్రజలు తీవ్ర స్థాయిలో ఆందోళన చెందుతున్నారు.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా భారత్ లో భారీగా కరోనా మృతుల నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో మరో 354 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ మరణాల తో మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,62,468 కి చేరింది. నిన్న ఒక్క రోజే 41,280 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ఇప్పటి వరకూ కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య 1,14,34,301 కి చేరింది. ప్రస్తుతం భారత్ లో 5,52,566 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.