మళ్ళీ మూడు లక్షలు దాటిన కరోనా కేసులు…మరో 3,449 మంది మృతి!

Tuesday, May 4th, 2021, 10:19:06 AM IST


కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. దేశం లో ప్రతి రోజూ మూడు లక్షలకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతూ ఉండటం తీవ్ర భయాందోళన కలిగిస్తోంది. అయితే గడిచిన 24 గంటల్లో మరో 16,63,742 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 3,57,229 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య రెండు కోట్లను దాటింది. అయితే భారత్ లో ఈ ఉదృతి ఇలా కొనసాగుతూనే ఉండటం పట్ల నిపుణులు సైతం హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

అయితే అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో మరో 3,449 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ మరణాల తో మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 2,22,408 కి చేరింది. నిన్న ఒక్క రోజే 3,20,289 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ఇప్పటి వరకూ భారత్ లో కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య 1,66,13,292 కి చేరింది. ప్రస్తుతం భారత్ లో 34,47,133 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.