భారత్ లో తగ్గిన కరోనా కేసులు…మరో 336 మంది మృతి

Monday, December 14th, 2020, 11:34:46 AM IST

కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత భారత్ లో కొనసాగుతూనే ఉంది. అయితే దీని తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. గడిచిన 24 గంటల్లో 8,55,157 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 27,071 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 98,84,100 కి చేరింది. అయితే దీని తీవ్రత ఇంకా ఉండటం తో పాజిటివ్ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే గత కొద్ది రోజులుగా మృతుల సంఖ్య తక్కువగానే నమోదు అవుతుంది. గడిచిన 24 గంటల్లో మరో 336 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,43,355 కి చేరింది. అయితే కరోనా వైరస్ రికవరీ లో మాత్రం భారత్ మెరుగ్గా ఉందని చెప్పాలి. గడిచిన 24 గంటల్లో మరో 30,695 మంది కొలుకొగా, ఇప్పటి వరకు 93,88,159 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ప్రస్తుతం భారత్ లో 3,52,586 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ గా ఉన్నాయి.