తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా.. కొత్తగా మరో 3,307 పాజిటివ్ కేసులు..!

Thursday, April 15th, 2021, 10:37:12 AM IST

తెలంగాణలో కరోనా మరింత విజృంభిస్తుంది. ఓ పక్క కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ జరుగుతున్నప్పటికి కేసుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. అయితే తాజాగా గడిచిన 24 గంటలలో రాష్ట్ర వ్యాప్తంగా 1,06,627 కరోనా పరీక్షలు నిర్వహించగా 3,307 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,38,045 కి చేరింది.

అయితే కరోనా నుంచి ఇప్పటివరకు 3,08,396 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇంకా 27,861 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 897 మంది కరోనా నుంచి కోలుకోగా మరో 8 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,788 కి చేరింది. ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 1,13,60,001 టెస్ట్‌లు చేశారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 91.22 శాతం ఉండగా, మరణాల రేటు 0.52% ఉన్నట్టు హెల్త్ బులెటిన్ తెలిపింది.