తెలంగాణ లో భారీగా పెరిగిన కరోనా కేసులు

Friday, March 19th, 2021, 10:30:54 AM IST

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. గడిచిన 24 గంటల్లో 62,972 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 313 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. మళ్ళీ తెలంగాణ రాష్ట్రం లో 300 కి పైగా కేసులు నమోదు కావడం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం తెలంగాణ రాష్ట్రం లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 3,02,360 కి చేరింది. అయితే ఈ మహమ్మారి కి మారో పక్క వాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో ఇద్దరు కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ మరణాల తో మొత్తం తెలంగాణ రాష్ట్రం లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,664 కి చేరింది. అయితే నిన్న ఒక్క రోజే 142 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ఇప్పటి వరకూ తెలంగాణ రాష్ట్రం లో 2,98,262 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లో 2,434 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి. దేశ వ్యాప్తంగా కరోనా వాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం గా కొనసాగుతుండటం తో పాజిటివ్ కేసుల సంఖ్య తో పాటుగా మృతుల సంఖ్య కూడా తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.