భారత్ లో మరో 62,714 కేసులు…312 మరణాలు!

Sunday, March 28th, 2021, 11:42:19 AM IST

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. వైరస్ తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. వైరస్ తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉండటం పట్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరో పక్క పాజిటివ్ కేసుల సంఖ్య సైతం పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 11 లక్షల 81 వేల మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 62,714 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 1,19,71,624 కి చేరింది.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అంతకుముందు రోజు 291 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ మరణించగా, గడిచిన 24 గంటల్లో మరో 312 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ మరణాల తో మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,61,552 కి చేరింది. నిన్న ఒక్క రోజే 28,739 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ఇప్పటి వరకూ 1,13,23,762 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. అయితే ప్రస్తుతం దేశం లో యాక్టివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మొత్తం 4,86,310 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు దేశం లో యాక్టివ్ గా ఉన్నాయి. మరో పక్క దేశ వ్యాప్తంగా కరోనా వాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం గా జరుగుతోంది.