భారత్ లో తగ్గిన కరోనా కేసులు…మరో 301 మంది మృతి

Tuesday, December 22nd, 2020, 10:58:56 AM IST

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 10,72,228 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 19,556 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది.అయితే ఇరవై వేలకు తక్కువగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కావడం కాస్త ఊరట కలిగించే అంశం అని చెప్పాలి. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 1,00,75,116 కి చేరింది.

అదే తరహా కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 301 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,46,111 కి చేరింది. అయితే కరోనా వైరస్ రికవరీ రేటు భారత్ మెరుగ్గా ఉందని చెప్పాలి. ప్రస్తుతం భారత్ లో 95.65 శాతంగా కరోనా వైరస్ రికవరీ రేటు ఉంది. ఇప్పటి వరకు 96,36,487 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ప్రస్తుతం భారత్ లో 2,92,518 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.