తెలంగాణ లో తాజాగా నమోదు అయిన కరోనా లెక్కలు ఇవే!

Sunday, August 30th, 2020, 11:11:06 AM IST

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుంది. రోజురోజుకీ ఈ మహమ్మారి భారిన పడి చాలా మంది అనారోగ్యానికి గురి అవుతున్నారు. అయితే తాజాగా శనివారం నాడు 61,148 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 2,924 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అయితే తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల తో కలిపి మొత్తం తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 1,20,090 కి చేరింది.

అయితే కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలను కోల్పోతున్న వారు తెలంగాణ లో పదుల సంఖ్యలో ఉన్నారు. గడిచిన 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రం లో 10 మంది కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలను కోల్పోయారు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ సోకి మృతి చెందిన వారి సంఖ్య 818 కి చేరింది. తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ నుండి కోలుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది.

తెలంగాణ రాష్ట్రం లో గడిచిన 24 గంటల్లో 1,638 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఇప్పటి వరకు కరోనా సోకి కోలుకొని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య తెలంగాణ రాష్ట్రం లో 90,988 కి చేరింది. అయితే తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ రికవరీ రేటు మెరుగ్గా ఉంది అని తెలుస్తోంది. అంతేకాక కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలను కోల్పోతున్న వారి సంఖ్య ఇతర రాష్ట్రాలతో పోల్చితే చాలా తక్కువే అని చెప్పాలి.అయితే తెలంగాణ రాష్ట్రం లో ప్రస్తుతం 31,284 యాక్టిివ్ కేసులు ఉన్నాయి. అయితే ఈ యాక్టిివ్ కేసుల సంఖ్య మంత్రి రోజురోజుకీ మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.