లేటెస్ట్ అప్డేట్: దేశంలో మరో 68,020 కరోనా కేసులు…291 మరణాలు!

Monday, March 29th, 2021, 11:04:46 AM IST

india_corona

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గత కొద్ది రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అయితే తాజాగా 70 వేలకు చేరువలో కేసులు నమోదు అవుతూ ఉండటం పట్ల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గడిచిన 24 గంటల్లో మరో 9,13,319 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 68,020 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య కోటి 20 లక్షలకు పైగా చేరింది. అయితే ఈ మహమ్మారి కి వాక్సిన్ అందుబాటులోకి వచ్చినా కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటం పట్ల ప్రజలు అప్రమత్తం గా ఉండాలని నిపుణులు అంటున్నారు.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఊహించనీ రీతిలో కరోనా వైరస్ మరణాలు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో మరో 291 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ మరణాల తో మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,61,843 కి చేరింది. నిన్న ఒక్క రోజే 32,231 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ఇప్పటి వరకూ కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య దేశంలో కోటి 13 లక్షలకు పైగా చేరింది. ప్రస్తుతం భారత్ లో 5,21,808 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.