తెలంగాణ లో మరో 278 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు

Thursday, March 18th, 2021, 10:00:07 AM IST

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 59,905 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 278 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం తెలంగాణ రాష్ట్రం లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 3,02,047 కి చేరింది. అయితే ఈ మహమ్మారి తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉండటం ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఈ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉండటం పట్ల రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఒక కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

అయితే అదే తరహా లో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో ముగ్గురు కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ మరణాల తో మొత్తం తెలంగాణ రాష్ట్రం లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,662 కి చేరింది. అయితే నిన్న ఒక్క రోజే 111 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ఇప్పటి వరకూ తెలంగాణ రాష్ట్రం లో 2,98,120 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లో 2,265 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. మరో పక్క దేశ వ్యాప్తంగా కరోనా వాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం గా జరుగుతోంది.