భారత్ లో మరో 18,088 కరోనా కేసులు…264 మరణాలు

Wednesday, January 6th, 2021, 11:11:40 AM IST

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 9,31,408 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 18,088 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 1,03,74,932 కి చేరింది. అయితే ఈ మహమ్మారికి ఇంకొద్ది రోజుల్లో దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వాక్సిన్ అందుబాటులోకి రానున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ వాక్సిన్ తో కేసుల సంఖ్య ఇంకా తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది.

అయితే కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 264 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,5 లక్షలకు చేరింది. అయితే నిన్న ఒక్కరోజే 21,314 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ఇప్పటి వరకు 99.97 లక్షల మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ప్రస్తుతం భారత్ లో 2,27,546 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.