భారత్ లో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు…మరో 257 మంది మృతి!

Friday, March 26th, 2021, 10:26:54 AM IST

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. ఊహించని రీతిలో ఈ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో మరో 11,00,756 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 59,118 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య కోటి 18 లక్షలకు పైగా చేరింది. అయితే ఈ మహమ్మారి ఉగ్ర రూపం దాల్చడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 257 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ మరణాల తో మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,60,949 కి చేరింది. నిన్న ఒక్క రోజే 32,987 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ఇప్పటి వరకూ 1,12,64,637 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. అయితే మరో పక్క క్రియాశీల కేసులు పెరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం భారత్ లో 4,21,066 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.