భారత్ లో భారీగా తగ్గిన కరోనా కేసులు… మరో 252 మంది మృతి

Tuesday, December 29th, 2020, 11:26:59 AM IST

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత భారీగా తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. గడిచిన 24 గంటల్లో మరో 9,83,695 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 16,432 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అయితే కరోనా వైరస్ భారీగా తగ్గుముఖం పట్టడం కాస్త ఊరట కలిగించే అంశం అని చెప్పాలి. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 1,02,24,303 కి చేరింది. అయితే ఈ మహమ్మారి కి ఇంకా పూర్తి స్థాయిలో వాక్సిన్ అందుబాటులో లేకపోవడం తో కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

అయితే అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 252 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,48,153 కి చేరింది. నిన్న ఒక్కరోజే 24,900 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ఇప్పటి వరకు 98 లక్షల మందికి పైగా కరోనా వైరస్ నుండి కొలుకోగా, ప్రస్తుతం 2,68,581 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.