బిగ్ న్యూస్: భారత్ లో మరో 22,273 కరోనా కేసులు…251 మరణాలు

Saturday, December 26th, 2020, 05:22:17 PM IST

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే గత కొద్ది రోజులుగా ఈ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమం గా తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో 22,273 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 1,01,69,118 కి చేరింది. అయితే ఈ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉన్నప్పటికీ తక్కువగా కేసులు నమోదు కావడం కాస్త ఊరట కలిగించే అంశం అని చెప్పాలి.

అయితే కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే గత కొద్ది రోజులుగా పోల్చితే 300 కి దిగువగా కరోనా వైరస్ మృతుల సంఖ్య నమోదు కావడం కాస్త ఊరట కలిగించే అంశం అని చెప్పాలి. గడిచిన 24 గంటల్లో మరో 251 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,47,343 కి చేరింది. నిన్న ఒక్కరోజే 22,274 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకొని డిశ్చార్జ్ కాగా, ఇప్పటి వరకూ కరోనా వైరస్ భారిన పడి కోలుకున్న వారి సంఖ్య 97,40,108 కి చేరింది. ప్రస్తుతం భారత్ లో 2,81,667 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి. అయితే ఈ కరోనా వైరస్ తీవ్రత భారత్ లో తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది.