తెలంగాణ లో మరో 2,474 కరోనా కేసులు

Saturday, August 22nd, 2020, 09:26:30 AM IST

Corona_india

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుంది. రోజురోజుకీ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 2,474 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకూ తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 1,01,865 కి చేరింది. అదే విధంగా కరోనా సోకి నిన్న ఒక్క రోజే 7 మంది ప్రాణాలను కోల్పోయారు. దీంతో మొత్తం తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 744 కి చేరింది.

కరోనా వైరస్ భారీ నుండి కోలుకొని డిశ్చార్జ్ అవుతున్న వారి సంఖ్య తెలంగాణ రాష్ట్రం లో రోజు రోజుకు పెరిగిపోతుంది. నిన్న ఒక్క రోజే 1,768 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకొని డిశ్చార్జ్ కాగా, ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం లో కోలుకొని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 78,735 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రం లో 22,386 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం లో ఎక్కువగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. నిన్న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 447 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు కేసులు నమోదు అయ్యాయి.