ఢిల్లీ లో ఏ మాత్రం తగ్గని కరోనా ఉధృతి…మరో 24 మంది మృతి!

Saturday, September 26th, 2020, 01:15:51 AM IST

Corona

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. గడిచిన 24 గంటల్లో మరో 3,827 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి ఇప్పటి వరకు మొత్తం ఢిల్లీ లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2 లక్షల 64 వేలకు పైగా చేరింది. ఈ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

గడిచిన 24 గంటల్లో కరోనా వైరస్ భారిన పడి చికిత్స పొందుతూ 24 మంది ప్రాణాలను కోల్పోయారు. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో ఢిల్లీ లో ఇప్పటి వరకు కరోనా సోకి మృతి చెందిన వారి సంఖ్య 5,147 కి చేరింది. గడిచిన 24 గంటల్లో 4,061 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకోగా, ఇప్పటి వరకూ కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య 2,28,436 కి చేరింది. ప్రస్తుతం ఢిల్లీ లో 30,867 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.