భారత్ లో మరో 18,139 కేసులు…234 మరణాలు

Friday, January 8th, 2021, 11:15:44 AM IST

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 9,35,369 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 18,139 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 1,04,13,417 కి చేరింది. అయితే ఈ మహమ్మారి తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉండటం ప్రజలకు ఆందోళన కలిగిస్తుంది. అయితే వాక్సిన్ కూడా ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటు లో లేకపోవడం తో పాజిటివ్ కేసుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 234 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,50,570 కి చేరింది. అయితే అన్ని దేశాల్లో కెల్లా భారత్ లోనే కరోనా వైరస్ రికవరీ రేటు అత్యధికం అని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. భారత్ లో రికవరీ రేటు 96.39 శాతంగా ఉండగా, ఇప్పటి వరకూ 1,00,37,398 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ప్రస్తుతం భారత్ లో 2,25,449 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.