భారత్ లో తగ్గిన కరోనా కేసులు…మరో 217 మంది మృతి

Sunday, January 3rd, 2021, 12:43:29 PM IST

కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే గత కొద్ది వారాలుగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో మరో 9,58,125 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 18,177 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 1,03,23,965 కి చేరింది. అయితే ఇంకా దీని ప్రభావం ఉండటం తో పాజిటివ్ కేసుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 217 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,49,435 కి చేరింది. కరోనా వైరస్ రికవరీ లో భారత్ మెరుగ్గా ఉందని చెప్పాలి. గడిచిన 24 గంటల్లో మరో 20,923 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య 99,27,310 కి చేరింది. ప్రస్తుతం భారత్ లో 2,47,220 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.