భారత్ లో మరో 16,504 కేసులు…214 మరణాలు

Monday, January 4th, 2021, 10:56:16 AM IST

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే గత కొద్ది రోజులుగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుంది. గడిచిన 24 గంటల్లో మరో 7,35,978 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 16,504 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 1,03,40,469 కి చేరింది. అయితే భారత్ కరోనా వైరస్ వాక్సిన్ కి ఆమోదం తెలపడం తో కేసుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 214 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే గత కొద్ది రోజులుగా 300 కి దిగువగా కరోనా వైరస్ మరణాలు నమోదు కావడం కాస్త ఊరట కలిగించే అంశం అని చెప్పాలి. అయితే తాజాగా కరోనా వైరస్ తో మృతి చెందిన వారి తో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,49,649 కి చేరింది. అయితే భారత్ లో కరోనా వైరస్ రికవరీ రేటు 96.16 శాతంగా ఉంది. ఇప్పటి వరకూ 99,46,867 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ప్రస్తుతం భారత్ లో 2,43,953 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.