తెలంగాణ లో తాజాగా నమోదు అయిన కరోనా లెక్కలు ఇవే!

Saturday, September 19th, 2020, 09:42:46 AM IST

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కరోనా వైరస్ ను అడ్డుకొనే వీలు లేకుండా పోయింది. ఈ మహమ్మారి వ్యాప్తి తెలంగాణ లో కూడా ఎక్కువగానే ఉంది అని తెలుస్తోంది. గడిచిన 24 గంటల్లో 2,123 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే తాజా గా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 1,69,169 కి చేరింది అయితే ఈ కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకీ మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

అదే తరహాలో గడిచిన 24 గంటల్లో ఈ మహమ్మారి భారిన పడి 9 మంది ప్రాణాలను కోల్పోయారు. తాజాగా ఈ కరోనా వైరస్ కారణం గా మృతి చెందిన వారితో కలిపి, తెలంగాణ లో ఇప్పటివరకు కరోనా సోకి మృతి చెందిన వారి సంఖ్య 1,025 కి చేరింది. తెలంగాణ లో కరోనా వైరస్ రికవరీ రేటు కాస్త మెరుగ్గా ఉందని చెప్పాలి. గడిచిన 24 గంటల్లో 2,151 మంది కరోనా వైరస్ నుండి కోలుకోగా, ఇప్పటి వరకూ ఈ వైరస్ భారిన పడి తెలంగాణ రాష్ట్రం లో కోలుకున్న వారి సంఖ్య1,37,500 కి చేరింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లో 30,636 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.