భారత్ లో మరో 46,951 కేసులు…212 మరణాలు

Monday, March 22nd, 2021, 11:12:37 AM IST

india_corona

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. దేశం లో 40 వేలకు పైగా కేసులు వరుస గా నమోదు అవుతూ ఉండటం దేశ ప్రజలను తీవ్ర ఆందోళన కి గురి చేస్తోంది. గడిచిన 24 గంటల్లో కేసులు 50 వేలకు చేరువ లో ఉండటం కాస్త ఆందోళన కలిగించే అంశం అని చెప్పాలి. గడిచిన 24 గంటల్లో 8,80,655 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 46,951 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 1,16,46,081 కి చేరింది. అయితే తాజాగా నమోదు అవుతున్న కేసుల తో ప్రజలు అప్రమత్తం గా ఉండాలని నిపుణులు అంటున్నారు.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో రెండు వందలకు పైగా కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలు కోల్పోవడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. గడిచిన 24 గంటల్లో 212 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,59,967 కి చేరింది. నిన్న ఒక్క రోజే 21,180 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ఇప్పటి వరకూ కోటి 11 లక్షల మంది ఈ మహమ్మారి భారీ నుండి కోలుకున్నారు. ప్రస్తుతం భారత్ లో 3,34,646 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. అయితే ఈ క్రియా శీల కేసులు కూడా రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. మరో వైపు దేశ వ్యాప్తంగా కరోనా వాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం గా జరుగుతోంది.