ఏపీ లో తగ్గిన కరోనా కేసులు…మరో 21 మంది మృతి

Sunday, October 25th, 2020, 05:30:03 PM IST

AP_corona
గత కొద్ది రోజులుగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో నమోదు అవుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులను పరిశీలిస్తే, రాష్ట్రం లో కరోనా వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టింది అని చెప్పాలి. గడిచిన 24 గంటల్లో 67,419 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 2,997 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 8,04,128 కి చేరింది. ఈ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

అయితే అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 21 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే తాజాగా నమోదు అయిన ఈ మరణాల తో మొత్తం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ సోకి మృతి చెందిన వారి సంఖ్య 6,587 కి చేరింది. అయితే కరోనా వైరస్ రికవరీ లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కాస్త గట్టి చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గడిచిన 24 గంటల్లో 3,585 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకొగా, ఇప్పటి వరకు కరోనా వైరస్ నుండి కోలుకున్న వారి సంఖ్య 7,66,681 కి చేరింది. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో 30,860 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.