కరోనా అప్డేట్: మూడు లక్షలకు చేరువలో కేసులు…మరో 2,023 మంది మృతి

Wednesday, April 21st, 2021, 12:12:27 PM IST

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. ఊహించని రీతిలో పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. తాజాగా మరో 16,39,357 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 2,95,041 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అయితే తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 1,56,16,130 కి చేరింది. అయితే కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మునుపెన్నడూ లేని విధంగా నమోదు కావడం తీవ్ర భయాందోళన ను కలిగిస్తుంది.

అదే తరహాలో కరోనా వైరస్ మరణాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. భారత్ లో ఊహించని రీతిలో కరోనా వైరస్ మరణాలు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో మరో 2,023 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే భారత్ లోకి కరోనా వైరస్ ప్రవేశించాక ఈ తరహాలో కరోనా వైరస్ మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి. భారత్ లో ఒక్క రోజే 2 వేలకు పైగా కరోనా వైరస్ మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి. అయితే ఈ మరణాల పట్ల ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ మరణాల తో మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,82,553 కి చేరింది. నిన్న ఒక్క రోజే 1,67,457 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ఇప్పటి వరకూ భారత్ లో కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య 1,32,76,039 కి చేరింది. ప్రస్తుతం భారత్ లో 21,57,538 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి. అయితే కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండటం తో పలు రాష్ట్రాలలోని నగరాల్లో లాక్ డౌన్ ను ఎంచుకొగా, మరి కొన్ని రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూ లను విధిస్తున్నారు.