భారత్ లో మరో 16,375 కేసులు…201 మరణాలు

Tuesday, January 5th, 2021, 11:05:11 AM IST

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య గత కొద్దీ రోజులుగా తక్కువ సంఖ్యలో నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో మరో 8,96,236 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 16,375 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 1,03,56,844 కి చేరింది. అయితే కరోనా వైరస్ మహమ్మారి కి వాక్సిన్ కూడా భారత్ ఆమోదం తెలపడం తో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 201 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,49,850 కి చేరింది. అయితే నిన్న ఒక్కరోజే 29,091 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ఇప్పటి వరకూ 99 లక్షల 75 వేల మందికి పైగా కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ప్రస్తుతం భారత్ లో 2.31 లక్షల కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.