భారత్ లో మరో 18,645 కేసులు…201 మరణాలు

Sunday, January 10th, 2021, 01:12:08 PM IST

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 8,43,307 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 18,645 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అయితే తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 1,04,50,284 కి చేరింది. అయితే ఈ మహమ్మారి తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉండటం తో పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. జనవరి 16 నుండి భారత్ లో కరోనా వాక్సిన్ వేసే ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే వాక్సిన్ అందుబాటులో వచ్చే వరకు కరోనా వైరస్ కేసుల సంఖ్య కొనసాగే అవకాశం ఉంది.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 201 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,50,999 కి చేరింది. నిన్న ఒక్కరోజే 19,299 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ఇప్పటి వరకూ కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య 1,00,75,950 కి చేరింది. భారత్ లో ప్రస్తుతం 2,23,335 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.