ఒక్క రోజులో 20 లక్షలకు పైగా వాక్సిన్ పంపిణీ

Tuesday, March 9th, 2021, 04:17:44 PM IST

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉంది.ఇప్పటి వరకూ దాదాపు కోటి 12 లక్షల మందికి పైగా కరోనా వైరస్ సోకిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం 2 లక్షల లోపే పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి. అయితే ఈ మహమ్మారి కి వాక్సిన్ అందుబాటులోకి రావడం తో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. మృతుల సంఖ్య సైతం క్రమంగా తగ్గుతూనే ఉంది. అయితే వాక్సినేషన్ ప్రక్రియ దేశం లో వేగవంతం గా కొనసాగుతుంది. దేశ వ్యాప్తంగా లక్షల కరోనా డోస్ లను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. అయితే గత 24 గంటల్లో 20 లక్షల 19 వేల డోసులను పంపిణీ చేసింది. అయితే కరోనా వైరస్ మహమ్మారి కి వాక్సిన్ అందుబాటులోకి వచ్చాక ఇన్ని డోస్ లను పంపిణీ చేయడం ఇదే తొలిసారి అని చెప్పాలి.అయితే ఇప్పటి వరకూ కూడా భారత్ లో 2 కోట్ల 30 లక్షల డోస్ లని ప్రభుత్వం పంపిణీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.