ఏపీ కి చేరిన మరో రెండు లక్షల కోవిడ్ టీకాలు!

Wednesday, April 21st, 2021, 04:02:10 PM IST

దేశం లో కరోనా వైరస్ మహమ్మారి విలయ తాండవం తో ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు. అయితే కరోనా వైరస్ వాక్సిన్ తో మహమ్మారి కి చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. అయితే వాక్సిన్ అందుబాటులోకి వచ్చినా, ఇంకా పంపిణీ లో మాత్రం సమస్యలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మరో రెండు లక్షల కరోనా వాక్సిన్ లు చేరాయి. ఈ ఉదయం గన్నవరం విమానాశ్రయానికి రెండు లక్షల వాక్సిన్ లు వచ్చాయి. పూణే నుండి గన్నవరం విమానాశ్రయానికి రెండు లక్షల కోవీషిల్డ్ టీకాలను తీసుకు వచ్చారు అధికారులు. అయితే వీటిని రోడ్డు మార్గం లో గన్నవరం లోని టీకా నిల్వ కేంద్రానికి తరలించడం జరిగింది. అయితే వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాల అనంతరం ఈ వాక్సిన్ లను జిల్లాలకు పంపిణీ చేయనున్నారు అధికారులు.