భారత్ లో మరో 40,715 కేసులు…199 మరణాలు

Tuesday, March 23rd, 2021, 10:42:57 AM IST

india_corona

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో జరిపిన కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలలో 40,715 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 1,16,86,796 కి చేరింది. అయితే నిన్నటి తో పోల్చితే నేడు కేసుల సంఖ్య కాస్త తగ్గినట్లు తెలుస్తోంది. అయితే ఈ మహమ్మారి కి వాక్సిన్ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 199 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ మరణాల తో మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య లక్ష అరవై వేలకు పైగా చేరింది. అయితే నిన్న ఒక్క రోజే 29,785 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ఇప్పటి వరకూ కోటి 11 లక్షల మందికి పైగా కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ప్రస్తుతం భారత్ లో 3,45,377 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. మరో పక్క దేశ వ్యాప్తంగా కరోనా వాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం గా జరుగుతోంది.