భారత్ లో మరో 16,946 కరోనా కేసులు…198 మరణాలు!

Thursday, January 14th, 2021, 12:19:13 PM IST

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 16,946 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ భారిన పడిన వారి సంఖ్య 1,05,12,000 కి చేరింది. అయితే ఈ మహమ్మారికి వాక్సిన్ 16 వ తేదీ నుండి అందుబాటులోకి రానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మేరకు కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత భారత్ లో మున్ముందు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

అయితే కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 198 మంది కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలను కోల్పోయారు. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,51,727 కి చేరింది. అయితే ఇప్పటి వరకూ కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య భారత్ లో 1,01,46,763 కి చేరింది. ప్రస్తుతం భారత్ లో 2,13,603 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.